కల్తీ అల్లం పేస్ట్ తయారుచేస్తున్న కంపెనీ పై పోలీసుల దాదులు

కల్తీ అల్లం పేస్ట్ తయారుచేస్తున్న కంపెనీ పై పోలీసుల దాదులు

3.5 టన్నుల కల్తీ అల్లం స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక మారు కల్తీ అల్లం తయారు చేస్తున్నా ముటా గుట్టు రాజేంద్రనగర్ పోలీసులు రట్టు చేశారు .

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి వద్ద ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, ప్రమాదకర కెమికల్స్ కలుపుతూ, శుభ్రత పాటించకుండా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కల్తీ అల్లం పేస్ట్ కంపెనీ పై ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అల్లం పేస్టు కంపెనీ నిర్వాహకులు దిల్దర్ అలీ జాన్సన్ (45), సోను కుమార్ (22) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నామోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.