బింగి ప్రవీణ్ పై పోలీస్ లు కేసు పట్టాలి

బింగి ప్రవీణ్ పై పోలీస్ లు కేసు పట్టాలి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన బీఆరెస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీణ్ పై పోలీస్ లు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు హేమలత మీడియాతో మాట్లాడారు. కుటుంబ తగాదాల్లో సహాయం కోరిన వివాహితను లొంగతీసుకోవడానికి మెసేజ్ లు పెట్టి వేధించిన ప్రవీణ్ ను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. మహిళలకు అన్నగా అండగా నిలువ వలసిన బీఆరెస్ నేతలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం శోచనీయమన్నారు. బెల్లంపల్లి దుర్గం చిన్నయ్యను యువ నాయకులు ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. బీఆరెస్ నేతల చర్యలు మహిళా లోకం ఆగ్రహించుకునేలా ఉందని విమర్శించారు. ప్రవీణ్ పై పోలీస్ చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నేత అని కనికరం చూపవద్దని కోరారు.