వేములవాడ రాజకీయాలు రసవత్తరం..

వేములవాడ రాజకీయాలు రసవత్తరం..
  • చెన్నమనేని కుటుంబానికి బోయినపల్లి ఫుల్ సపోర్ట్..
  • చెన్నమనేనికి మద్దతుగా బోయినపల్లి వినోద్ కుమార్​ రంగంలోకి
  • పార్టీలో నష్టనివారణ చర్యలు చేపట్టిన మాజీ ఎంపి వినోద్ కుమార్
  • చెన్నమనేనికి అధిష్టానానికి పెరిగిన అంతరం తొలగించే ప్రయత్నాలు
  • త్వరలోనే సిఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం విఫలయత్నం
  • వేములవాడ లో చల్మెడకు చెక్ పెట్టేందుకు చెన్నమనేని వర్గం తీవ్ర ప్రయత్నాలు
  • వేములవాడ నియోజకవర్గంలో చెన్నమనేని మకాం.. నిత్యం పర్యటనలు..
  • కుల సంఘాల వారిగా సమావేశాలు.. అసంతృప్తి నాయకులకు బుజ్జగింపు ప్రయాత్నాలు

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేశ్ బాబు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లోనే అసమ్మతి పెరగగా.. పలు వివాదస్పద వాఖ్యాలతో బీఆర్ఎస్ అధిష్టానంతో కూడా చెన్నమనేనికి అంతరం పెరిగినట్లు రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ వేములవాడ ఎమ్మెల్యే టికెట్ కోసం చల్మెడ వైద్య సంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి లు తీవ్ర ప్రయత్నం చేస్తుండగా.. చెన్నమనేని రమేశ్ బాబు, చల్మెడ లక్ష్మీనరసింహారావుకు రాజకీయ విరోదం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. వేములవాడ లో బీఆర్ఎస్ నేతలు రెండు గ్రూపులుగా వీడిపోయారు. చెన్నమనేని రమేశ్బాబును వ్యతిరేఖిస్తున్న బీఆర్ఎస్ నేతలంతా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డితో సహా చల్మెడ లక్ష్మీనరసింహారావు రాజకీయ శిబిరంలో చేరిపోయారు. దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం చెల్మెడను రాజకీయంగా దగ్గరంగా తీసుకోని క్లోజ్ గా మూవ్ కావడం.. పరోక్షంగా చల్మెడకు టికెట్ అన్నవిధంగా వ్యవహరించడంతో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు వర్గీయులు మొత్తం కాస్త సమాలోచనలో పడ్డారు. చల్మెడ వేములవాడలో ఆఫీస్ ఓపెన్ చేసి .. వైద్య శిబిరాలు..పార్టీ బతోపేతం సమావేశాల  పేరిట రోజుకో మండలం సందర్శిస్తూ.. తన గ్రౌండ్ వర్క్ను ప్రారంభించారు. చల్మెడ లక్ష్మీనరసింహారావుకు, చెన్నమనేనికి రాజకీయంగా మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 

చెన్నమనేనికి బోయినపల్లి వినోద్ కుమార్​ ఫుల్ సపోర్ట్..

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, కరీంనగర్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. చెన్నమనేని కుటుంబానికి మొదటి నుంచి మద్దతుగా ఉన్న వినోద్కుమార్ ఈ సారి ఎలాగైన చెన్నమనేనిని రాజకీయంగా గట్టేక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. చెన్నమనేనికి రాజకీయంగా నష్టం జరగుతున్నప్పుడల్ల వేములవాడ పర్యటన చేసి..వినోద్ కుమార్ పత్రిక ముఖంగా.. చెన్నమనేనికే టికెట్..మరోసారి గెలిపించండి అంటూ ప్రకటనలు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం ముఖ్యమైన సమస్యలు, రమేశ్బాబుకు వచ్చే ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లే ముంపు గ్రామాల సమస్యపై వినోద్ కుమార్​ దృష్టి సారించి చెన్నమనేని తీవసుకెళ్లి మరి.. సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులను కలుస్తున్నారు. నియోజకవర్గంలో చెన్నమనేనికి ముంపు గ్రామాల్లో సానుకూల పరిస్థితులు తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నడు లేని విధంగా చెన్నమనేని వేములవాడ నియోకవర్గంలో అత్యధిక సమయాన్నికేటాయిస్తూ.. ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. పలు సామాజిక వర్గాల ముఖ్యులతో సంగీత నిలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. అసంతృప్తి ప్రజాప్రతినిధులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో బోయినపల్లి వినోద్కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణాలమాలు.. అటు సీఎం కేసీఆర్కు, ఇటు మంత్రి కేటీఆర్కు వివరించేందకు.. సిద్దమవుతున్నట్లు తెలిసింది.

చెన్నమనేని లో మార్పు.. ఎటు వెళ్లిన లీడర్లను కలుపుకుపోతున్నాడు..

వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు లో కాస్తా రాజకీయ మార్పు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నడులేని విధంగా చెన్నమనేని రమేశ్బాబు ఏ పర్యటనకు వెళ్లిన.. వేములవాడ ప్రజాప్రతినిధులు, ముఖ్య లీడర్లను వెంటపెట్టుకోని కార్యక్రమాలకు హజరౌతున్నారు. ఈ మధ్య సిరిసిల్ల లో పట్టాల పంఫిణి కార్యక్రమానికి హజరైన చెన్నమనేని రమేశ్ బాబు తన వేములవాడ రాజకీయ పరివారాన్ని బారి స్థాయిలో వెంట తీసుకోని సిరిసిల్ల కు వచ్చారు. పట్టాల పంపిణి అనంతరం పద్మనాయక కల్యాణమండపంలోని చాంబర్లో వేములవాడ బీఆర్ఎస్ క్యాడర్ తో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎలాగైన వేములవాడ నియోజకవర్గంలో చల్మెడకు చెక్ పెట్టేందుకు చెన్నమనేని వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.