దిష్టిబొమ్మ దహనం చేసిన పీఓడబ్ల్యూ

దిష్టిబొమ్మ దహనం చేసిన పీఓడబ్ల్యూ

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మణిపూర్ లో మహిళను వివస్త్రను చేసి అత్యాచారం చేసిన ఘటనను నిరసిస్తూ అక్కడి ప్రభుత్వం దిష్టిబొమ్మను పీఓడబ్ల్యూ నేతలు దహనం చేశారు. మంగళవారం ఐబీ చౌరస్తా వద్ద ఐఎఫ్టీయూ నేతలు, పీఓడబ్ల్యూ మహిళలు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పీఓడబ్ల్యూ నాయకురాలు అందే మంగ మాట్లాడుతూ, మణిపూర్ లో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం మహిళల పై జరుగుతున్న దారుణ సంఘటన లు అడ్డుకోకపోవడం శోచనీయమన్నారు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.