పట్టుదలతో ప్రయత్నించి .... విజయం సాధించి
చిలుకూరు, ముద్ర : సూర్యాపేట జిల్లా , చిలుకూరు మండలం , జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన పందిరి ప్రియాంక రెడ్డి ఎంటెక్ పూర్తి చేసింది . వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ప్రియాంక పదవ తరగతి వరకు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు , ఇంటర్ , ఇంజనీరింగ్ కోదాడలో , ఎంటెక్ హైద్రాబాద్ లో పూర్తి చేసుకున్న అనంతరం కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించి గత ఏడాది నిర్వహించిన ఎస్సై , గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించింది . గత ఏడాది సెప్టెంబర్ 11 నుండి రాజేంద్రనగర్ టిజిపిఎ లో ఎస్సై ట్రైనింగ్ లో శిక్షణ పొందుతున్న వీరికి బుధవారంతో శిక్షణా కాలం పూర్తవటంతో , బుధవారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొని తన కల నెరవేర్చుకుంది .