షాద్ నగర్ లో EVM ల తరలింపు ప్రక్రియ ప్రారంభం

షాద్ నగర్ లో EVM ల తరలింపు ప్రక్రియ ప్రారంభం

ముద్ర, షాద్‌నగర్ : అసెంబ్లీ ఎన్నికల కి పోలింగ్ ఏర్పట్లు చురుకుగా సాగుతున్నాయి. పోలింగ్ సామగ్రి ని పోలింగ్ సిబ్బంది కి అందించి పోలింగ్ స్టేషన్లు కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసెంబ్లీలో మొత్తం ఆరు మండలాలు ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందూర్గు, చౌదరి గూడ మండలాల్లో మొత్తం 2 లక్షల 36వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. అక్టోబర్ 31 నాటికి 651 కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.గతంలో కంటే ఈ దఫా ఎన్నికల్లో 20 వేల ఓటర్లు పెరగాయి. 

గతంలో 2 లక్షల 10,266 మంది ఓటర్లు ఉండేవారు. ప్రస్తుతం పురుష ఓటర్లు 1లక్ష 1,9045మంది ఉండగా స్త్రీలు 1 లక్ష 1,7278 మంది ఉన్నారు. అలాగే 15 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు.
2014 పోలింగ్ పర్సంటేజ్ 85%మరియు2018 పోలింగ్ పర్సంటేజ్ 88% . నియోజకవర్గం మొత్తం ఎన్నికల విధుల్లో 1200 మంది సిబ్బంది పాల్గొంటుండగా 6 మండలాల్లో  మొత్తం 255 బూతులు ఉన్నాయి.