మత్స్యశాఖ అధికారుల ప్రచార లోపం

మత్స్యశాఖ అధికారుల ప్రచార లోపం
  • చేపల ప్రియులు రాక వెలవెలబోతున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
  • చేపల ఆహార మేళ(పండగ)కి ఆదరణ కరువు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 9 10 తేదీల్లో చేపట్టిన చేపల ఆహారమేళ(పండగ)ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు ప్రజల నుండి స్పందన లేకపోవడంతో ఆదరణ తగ్గింది. గురువారం సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో అట్టహాసంగా ప్రారంభించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మత్స్యశాఖ జిల్లా అధికారి రూపేందర్ సింగ్ తదితరులు హాజరై చేపల వంటకాలు రుచులు అదిరిపోయాయని కితాబిచ్చి లొట్టలేసుకుంటూ రుచిగా ఉన్నాయని మెచ్చుకున్నారు అట్టహాసంగా కార్యక్రమం అయితే మొదలైంది గాని తర్వాత అన్ని స్టాళ్ళు కూడా ప్రజలు లేక రాక వెలవెలపోయాయి. మొదటిరోజు ఉత్సాహంగా చేపల ఆహార పండుగ ప్రారంభమైందని అనుకున్నప్పటికీ తదుపరి సందర్శకులు రాక చేపల ప్రియుల నుండి స్పందన లేక శుక్రవారం ఉదయం పబ్లిక్ క్లబ్ లోని చేపల ఆహార పండుగ ప్రాంగణమంతా బోసిపోయి కనిపించింది   స్టాళ్లలో కూడా ఎలాంటి వంటకాలు పెట్టకపోవడం ప్రజలు రావట్లేదని ఉద్దేశంతోనే వంటకాలు సిద్ధం చేయలేదని అక్కడ ఉన్న ఒకరిద్దరు చెప్పడం గమనించదగ్గ విషయం.

అధికారుల ప్రచార లోపమే కారణమా...?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల ఆహార పండుగ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కొందరి మధ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం అనాలోచిత చర్యల వల్ల లోప భూయిష్టంగా మారి జనాధారం లేక కళకళలాడాల్సిన చేపల ఆహార పండగ ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి.

ఫుడ్ ఫెస్టివల్ గురించి విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న పబ్లిక్ క్లబ్ ప్రాంగణానికి రప్పించాల్సిన మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వహించడమే ప్రజలు రాకపోవడానికి ప్రధాన కారణంగా పలువురు పేర్కొంటున్నారు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ గురించి విస్తృతంగా సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా మైకులు కరపత్రాలు పత్రికలు టీవీల ద్వారా భారీ ఎత్తున ప్రచారం చేపట్టాల్సిన మత్స్యశాఖ అధికారులు ఈ విషయంలో విఫలమయ్యారని విమర్శలు వినవస్తున్నాయి కనీసం మత్స్య సహకార సంఘాల వారికి కూడా సరిగా రీతిలో సమాచారం ఇవ్వలేదని ఆయా సంఘాల వారు ఆరోపిస్తున్నారు మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపల ప్రియులతో కిటకిటలాడాల్సిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రాంగణం జనాలు లేక వెలవెల పోయిందంటే అందుకు కారణం అధికారులు తప్ప మరెవరు కారణం లేదననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేపల ఆహార పండుగని దండగగా మార్చిన మత్స్యశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు