పెంపుడు కుక్కకు పురుడు

పెంపుడు కుక్కకు పురుడు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నేటి సమాజంలో జంతువులను పెంచుకోవటం ఆనవాయితీ గా మారింది. ఈ నేపథ్యంలో తమ పెంపుడు జంతువులతో మమకారం కూడా పెరిగిపోతోంది. ఇదే క్రమంలో తమ ఇంట్లో పెంచుకున్న కుక్క ప్రసవిస్తే వివిధ ఆహార పదార్థాలను వండి మరీ పురుడు చేసిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రానికి చెందిన చంటి గత కొన్ని మాసాలుగా కుక్కను పెంచుకుంటున్నాడు. దాని ఆలనా పాలనా చూస్తూ కుటుంబ సభ్యురాలిగా చూసారు. ఐతే మూడు రోజులకు మునుపు ఆ పెంపుడు కుక్క మూడు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో చంటి తన పెంపుడు కుక్క కు వివిధ ఆహార పదార్థాలు వండించి పురుడు నిర్వహించారు. ఈ ఉదంతం ఆనోటా ఈనోటా వైరల్ గా మారింది.