రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి..

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలి..

హుజూర్ నగర్, ముద్ర :-రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని రాష్ట్ర సిపిఐ పార్టీ నాయకులు గన్నా చంద్రశేఖర్ కోరారు. ఆదివారం స్థానికంగా సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని కోరారు. అదేవిధంగా వానకాలం సీజన్ ప్రారంభమైన క్రమంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు సరఫరా చేయాలని సూచించారు. రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని గన్న చంద్రశేఖర్ కోరారు .రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులపై ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు .ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు ఎల్లవుల రాములు కంబాల శ్రీనివాస్ గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.