బంగ్లాదేశ్ లో హిందువులకు భద్రత కల్పించండి
- విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేష్
- హిందూ ఐక్యవేధిక ఆధ్వర్యంలో సామూహిక ర్యాలీ
ముద్ర/షాద్ నగర్: బంగ్లాదేశ్ లో హింసాకాండ జరుగు తున్న నేపథ్యంలో అక్కడి హిందువులకు భద్రత కల్పంచాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బం దారి రమేష్ కోరారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి పట్టణ ముఖ్య కూడలి మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సామూహిక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి రమేష్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్యని ఆయన అన్నారు.
హిందూ ఆలయాలు, గురుద్వారాలు దుకాణాలు, హిందూ శ్మశాన వాటికలు ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు 32శాతం ఉన్న హిందువులు నేడు 8 శాతానికి తక్కువగా ఉన్నారంటే ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హింసాకాండ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రతకు, మానవ హక్కుల పరిరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగు తున్న హింసాకాండను నిరసిస్తూ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.