పరిపాలనలో వేగంగా సంస్కరణలు - బడుగుల లింగయ్య యాదవ్

పరిపాలనలో వేగంగా సంస్కరణలు - బడుగుల లింగయ్య యాదవ్

ముద్ర నల్గొండ: తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిపాలనలో వేగంగా సంస్కరణను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని దీంతో తెలంగాణ సాధించుకొని స్వపారి పాలన పొందామని సంస్కరణల వేగవంతంతో సుపరిపాలన కూడా సాధ్యమైందని రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి నల్లగొండ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం లోని ఉదయాధిత్య భవన్లో. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో  స్వపరిపాలన వచ్చింది. సుపరిపాలన కూడా రావాలన్నది ముఖ్యమంత్రి  లక్ష్యం,అందుకే  ముఖ్యమంత్రి కెసిఆర్ వేగంగా పరిపాలన సంస్కరణలను చేపట్టారని వివరించారు.

ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పనిచేస్తే ఏ ప్రభుత్వమైనా ప్రజల ప్రశంసలు పొందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్  భావిస్తారన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి వేగంగా తీసుకెళ్లడం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన పూరపాలికలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పథకాలను, పాలసీలను దేశంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్పీ అపూర్వ రావు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.