బీసీకి టికెట్ ఇవ్వాలని బీసీ సంఘాల తీర్మానం- బీసీ ల రౌండ్ టేబుల్ సమావేశం

బీసీకి టికెట్ ఇవ్వాలని బీసీ సంఘాల తీర్మానం-  బీసీ ల రౌండ్ టేబుల్ సమావేశం

ముద్ర,ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ బీసీ లకు ఇవ్వాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం ఎఫ్.సీ.ఏ. ఫంక్షన్ హల్ లో  రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తొలుత మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి చిత్ర పటా లకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  వచ్చే ఎన్నికల్లో బీసీ లకు టికెట్ ఇవ్వాలని అన్ని పార్టీలపై ఒత్తిడి తేవాలని వక్తలు అన్నారు. నియోజకవర్గ ములో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నందున బీసీలకు టికెట్ ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, శిశు, సంక్షేమ శాఖ సమన్వయకర్త సరోజ, బీసీ నాయకులు కర్ణ శ్రీధర్ , నీలి శ్రీనివాస్ ,వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.