దుబ్బాక నియోజకవర్గ మన ఊరు మన బడిపై సమీక్ష

దుబ్బాక నియోజకవర్గ   మన ఊరు మన బడిపై సమీక్ష

పాఠశాలల పనుల -నత్తనడకపై కలెక్టర్ అసహనం

సిద్దిపేట : ముద్ర ప్రతి నిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న 'మన ఊరు మన బడి' పథకంపై సమీక్ష సమావేశం జరిగింది.
జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద  పాఠశాలలో చేపట్టిన  పనుల గుర్చి ఎచ్ఎం, ఎంఈవో,ఎంపిడిఒ, ఎంపిఓ,ఇంజినీరింగ్ విభాగం ఈఈ,డిఈ, ఎఈ నిర్మాణ ఏజెన్సీలు,సర్పంచ్ లు అందరితో కలిసి మండలాలోని పాఠశాలల వారిగా  నిర్వహించారు. 
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ-
 జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు.ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు పున: ప్రారంభంలోపు తప్పనిసరిగా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయ్యాలని ఆదేశించారు. మన ఊరు మన బడి పథక మొదటి విడత పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు. ఈపథకం లో ఎలక్ట్రిసిటీ పనుల్లో నాణ్యమైన రూపింగ్, లైట్లు,ప్యాన్లు వాడాలన్నారు.  తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లతో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు,కిచెన్ షెడ్,ప్రహరీ గోడ, డైనింగ్ హల్,అదనపు తరగతి గదుల పనులు చేపట్టాలని అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదని పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే  మైదానంలో సుందరీకరణ పనులు చేయ్యాలని  సూచించారు.మెట్లపై గ్రానేట్, మంచి గేట్, పైన ఆర్చ్ మైదానంలో కొంత గడ్డి కార్పెట్ పరచాలని సూచించారు.ఈజిఎస్ పనులను జనరేట్ చేసిన ఎస్టిమేట్ వివరాలను అందించాలని   డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డిని ఆదేసించారు.

ఎంపిడిఒ,ఎంపిఓలు ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ చేయ్యాలని కోరారు. ఎఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలని సూచించారు.కలరింగ్ ఏజెన్సీకి మెథర్ మెంట్ షిట్ అందించాలని కోరారు.ఎంపిడిఒ ఎంపిఓలు,ఏఈలకు తోడ్పాటు నందించాలని చెప్పారు. దౌల్తాబాద్,దుబ్బాక మండలాల్లో పనుల్లో వేగం పెంచేందుకు,ఎప్టిఓ బుకింగ్ లో ఎఈ కి సహకరించాలని డిఈ కి తెలిపారు. 
పాఠశాలల పున:ప్రారంభం వరకు డైనింగ్ హల్ పూర్తి అయన పాఠశాలలకు ఫర్నిచర్ కోసం కమిషనర్ కి రిక్వెస్ట్ పెట్టుకోని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభం లోపు ఫర్నిచర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిఈఓ కి తెలిపారు. మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఆర్డీఏ పిడిచంద్రమోహన్ రెడ్డి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.