తుంగతుర్తి పట్టణంలో పట్టపగలే చోరీ

తుంగతుర్తి పట్టణంలో పట్టపగలే చోరీ
  • తాళం పగులగొట్టి 8 లక్షల ఎత్తుకెళ్లిన దొంగలు
  • అప్పుగడదామని తెచ్చిన డబ్బులు దొంగలు దోచుకెళ్లారు 
  • బాధితుడు శ్రీనివాస్
  • పోలీసులకు ఫిర్యాదు- దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఉదయం సుమారు 7 నుండి 8 గంటల ప్రాంతంలోమెయిన్ రోడ్ పై ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన జరిగింది .ఇందుకు సంబంధించి ఇంటి యజమాని నార్లపురం శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .తాను తుంగతుర్తి మెయిన్ రోడ్డు పక్కన గల ఇంట్లో హోటల్ నడుపుతున్నానని తన ఇంటికి హోటల్ కు మధ్య కొద్ది దూరం ఉందని తెలిపారు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 6 గంటలకు తాను హోటల్కు వెళ్లారనని అనంతరం తన కుటుంబ సభ్యులందరూ హోటల్కు వచ్చారని తెలిపారు. సుమారు ఎనిమిది గంటల సమయంలో తన కుమారుడు తిరిగి ఇంటికి వెళ్ళగా ఇంటి తలుపు తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయని వెంటనే తన కుమారుడు సమాచారం ఇవ్వగా తాను తన ఇంటికి వెళ్లానని తెలిపారు.

ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి తెరిచి ఉందని అందులో ఉండాల్సిన 8 లక్షల రూపాయల నగదు దోపిడీకి గురైందని తెలిపారు. తాను అప్పుగా చెల్లించడానికి తెచ్చిపెట్టుకున్న 8 లక్షల రూపాయలు చోరీకి గురి కావడంతో శ్రీను కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు .పట్టపగలే పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే తాళం పగలగొట్టి చోరీ చేసి డబ్బులు ఎత్తుకు వెళ్ళిన సంఘటన తుంగతుర్తి పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. గత కొద్ది రోజుల క్రితమే ఒక ఎరువుల దుకాణంలో తాళం పగలగొట్టి నగదు చోరీ చేసిన సంఘటన జరిగింది. ఇటీవలి ప కాలంలో తుంగతుర్తి పట్టణంలో దొంగతనాలు సాగుతున్నాయి.అంబేద్కర్ చౌరస్తాలోని ఒక ఇంట్లో దొంగలు పడి నగదు దోపిడీ చేసిన సంఘటన జరిగింది. గత రెండు మూడు సంవత్సరాలుగా పట్టణంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగలు మాత్రం ఇంతవరకు పట్టుపడలేదు. ఇకనైనా పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని పోలీసు అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.