తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో ఒకేరోజు ఏడు ఇళ్లలో దొంగతనం

తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో ఒకేరోజు ఏడు ఇళ్లలో దొంగతనం
  • వరుస దొంగతనాలతో ఆందోళన చెందుతున్న తుంగతుర్తి మండల ప్రజానీకం
  • గత పక్షం రోజుల క్రితం తుంగతుర్తి మండల కేంద్రంలో ఎరువుల దుకాణంలో చోరీ
  • తూర్పు గూడెం గ్రామంలో జరిగిన దొంగతనంలో సుమారు మూడు తులాల బంగారం ,నాలుగు కేజీల వెండి ,₹45 వేలు నగదు దొంగిలించిన దొంగలు.
  • దర్యాప్తు చేపట్టిన తుంగతుర్తి పోలీసులు

1 గ్రామస్తులు నుండి వివరాలు తెలుసుకుంటున్న ఎస్సై ఏడుకొండలు 2 దొంగతనం జరిగిన ఇంట్లో బీరువాను పరిశీలిస్తున్న ఎస్సై 3 తాళం పగలగొట్టిన దృశ్యం 4 బీరువా పగలగొట్టి వస్తువులు చిందర వందర చేసిన దృశ్యం


తుంగతుర్తి ముద్ర:- మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో సోమవారం రాత్రి  ఒకేసారి ఏడు ఇళ్లలో జరిగిన  దొంగతనాలతో గ్రామం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే తూర్పు గూడెం గ్రామంలో సోమవారం రాత్రి దొంగలు ఏడు ఇళ్లలో  చొరబడి దొంగతనం పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి  వచ్చింది. గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఏడుకొండలు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునే దర్యాప్తు చేపట్టారు. సంకినేని రామచంద్రరావు ఇంట్లో ఒకటిన్నర తులం బంగారం, మూడు కేజీల వెండి, నగదు 20వేల రూపాయలు, గట్టు జగదాంబ ఇంట్లో 20 తులాల వెండి కడియాలు, ముత్యం కాంతమ్మ ఇంట్లో పావు తులం బంగారం, 30 తులాల వెండి, నగదు పదివేల రూపాయలు, గునిగంటి కమలమ్మ ఇంట్లో 22 తులాల వెండి పట్టా గొలుసులు నగదు 15వేల రూపాయలు, దొంగిలించగా హజారి జగ్గయ్య,సంకినేని వెంకటేశ్వరరావు, లింగంపల్లి కలమ్మ ఇండ్లలో దొంగతనాలు జరిగినట్లు తుంగతుర్తి ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.

ఈ మేరకు గ్రామంలోని ఏడు ఇళ్లలో చొరబడి సుమారు మూడు తులాల బంగారం నాలుగు కేజీల వెండి ₹45000/- దొంగిలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా గత పక్షం రోజుల క్రితం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణంలో సుమారు రెండు లక్షల రూపాయలు నగదును దొంగలు ఎత్తుకెళ్లారు అలాగే సమీపంలో ఉన్న ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిల్ సైతం దొంగతనం చేశారు. కాగా మోటార్ సైకిల్ లభ్యమైనట్లు తెలిసింది. దొంగలు మాత్రం దొరకలేదు. తుంగతుర్తి మండలంలో తుంగతుర్తి, వెలుగు పల్లి ,ప్రస్తుతం తూర్పు గూడెం లో దొంగలు హల్చల్ చేయడంతో మండల ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్ శాఖ వారు దొంగల ఆటలు కట్టించి దొంగల బారి నుండి ప్రజలను కాపాడాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.