తాండూరు నుండి నన్ను అభ్యర్థిగా నిలపడము నా అదృష్టంగా భావిస్తున్నా - తాండూర్ జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ 

తాండూరు నుండి నన్ను అభ్యర్థిగా నిలపడము నా అదృష్టంగా భావిస్తున్నా - తాండూర్ జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజెపి -జనసేన అలయన్స్ ఖరారు అయిందని, బిజెపి -జనసేన అలయన్స్ లో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీకీ కేటాయించబడిందని, తాండూర్ జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు. జనసేన తరఫున తాండూర్ లో  మీడియతో మాట్లాడారు. తాండూర్ లో పోటీ చేయడము ఎంతో ఆనందం కలిగిస్తుందని అభ్యర్థి శంకర్ గౌడ్ అన్నారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మంచి రాజకీయ పరిణితితో వ్యవహరిస్తూ మంచి మనస్తత్వంతో ముందుకు సాగుతున్న మహా నాయకుడు అని అన్నారు.  ఆయన నాయకత్వంలో  తాండూర్ నుంచి జనసేన అభ్యర్థిగా బిజెపి  మద్దతుతో పోటీ చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. దేశ రక్షణ, సమగ్రతల కోసం ,దేశ ఆర్థిక విధానాలు, సంస్కరణల కోసం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , జాతీయ బిజెపి అధ్యక్షులు నడ్డా, మరి ఎందరో బిజెపి ప్రముఖులు కృషి చేస్తున్నారని అన్నారు.

 అదేవిధంగా రాష్ట్రంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ , చాలామంది బీజేపీ ప్రముఖులు రాష్ట్రంలో బీఆర్ఎస్ దుష్ట పాలన, రాచరిక పాలనను, కుటుంబ పాలనను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో బిజెపి- జనసేన కలయిక  ప్రారంభమైంది. ఇందులో భాగంగా తెలంగాణలో మేము కోరిన 11 సీట్ల విషయంలో 8 సీట్లు బిజెపి జనసేనకు కేటాయించింది, అందులో తాండూరు నుండి నన్ను అభ్యర్థిగా నిలపడము నా అదృష్టంగా భావిస్తున్నానని బిజెపి- జనసేన ఆలయన్స్  అభ్యర్థి శంకర్ గౌడ్ వివరించారు. తాండూరు తో పాటు రాష్ట్రంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు కేటాయించిన అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. తాండూరులో నా విజయం ఖాయమని రుజువైందన్నారు.