బి ఆర్ ఎస్ ను వీడి బిజెపి లో చేరిన సర్పంచులు

బి ఆర్ ఎస్ ను వీడి బిజెపి లో చేరిన సర్పంచులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:దీపావళి పండుగ రోజు పలువురు సర్పంచులు అధికార పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బిజెపి లో చేరారు. లక్ష్మణ చంద మండలం కనకాపూర్ గ్రామ సర్పంచ్ సుక్కు ముత్తన్న పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. మామడ మండలం మేజర్ గ్రామ పంచాయితీ పొన్కల్ సర్పంచ్ భీమేశ్వర్ అధికార పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాపురెడ్డి,  భూపాల్ రెడ్డి, రమేష్, భూపతి రెడ్డి, ముత్యం రెడ్డి, సరికెల గంగన్న తో పాటు పలువురు పాల్గొన్నారు.