తెలంగాణకు కెసిఆర్ కలుపు మొక్కనే

తెలంగాణకు కెసిఆర్ కలుపు మొక్కనే
  • తెలంగాణకు కెసిఆర్ కలుపు మొక్కన
  •  చీర కట్టుకొని బస్సు ఎక్కు కిషోర్ 
  • గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు 
  •  కిషోర్ గతంలో ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చినపాపాన పోలేదు
  • ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం

తుంగతుర్తి ముద్ర: ముమ్మాటికీ తెలంగాణకు కెసిఆర్ కలుపు మొక్కనే అని అలాంటి మొక్కను రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎదగనీయబోమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరి గారి ప్రీతం పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత పది సంవత్సరాల కాలంలో ఒక్క దళితుని కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పిచ్చిన పాపను పోలేదని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ ఇంట్లో పెద్ద జీతగానిగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి పై అవాకుల సచేవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. గతంలో ఇసుక దోపిడీ చేసిన గత ఎమ్మెల్యేకు చీర పంపిస్తున్నామని, ఆ చీరను కట్టుకొని బస్సు ఎక్కితే ఫ్రీ బస్సు లేదో తెలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటును ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి యువత అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. పది సంవత్సరాలు పరిపాలించి ఇసుక దోపిడి చేసిన నువ్వు మా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ఓటమికి మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు కంకణ బద్ధులై తరిమి కొట్టిన నీకు బుద్ధి రాలేదని అన్నారు. మరోసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రిపై నోటి దురుసు వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, గ్రామ మాజీ సర్పంచ్ మిట్ట గడుపుల అనుఖ్, మండల ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తప్పట్ల శంకర్, నాయకులు దాసరి శ్రీను, కలకోట్ల మల్లేష్, కొండ రాజు,మాచర్ల అనిల్, మిరియాల నాగయ్య, మంగళపల్లి నాగరాజు, పోలేపాక అంజయ్య, వంగాల దాసు, మిర్యాల జనార్ధన్, మిరియాల శ్రీను, చింతకుంట్ల హరీష్, మడిపెద్ది నవీన్, తదితరులు పాల్గొన్నారు.