ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు లైంగిక వేధింపు

ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు లైంగిక వేధింపు

బ్యాంకాక్‌ నుంచి ముంబయికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్‌ను  లైంగికంగా వేధించిన ఘటన సంచలనం రేపింది.  పీకల దాకా మద్యం తాగిన స్వీడిష్ జాతీయుడు(62) బ్యాంకాక్ లో ఇండిగో విమానం ఎక్కి 24 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడు.6 ఈ 1052 ఇండిగో విమానంలో భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్ట్‌బర్గ్ ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించాడు.దీంతోపాటు సహ ప్రయాణికుడిపై దాడి చేసి  విమానంలో అల్లకల్లోలం సృష్టించాడు.ఈ కేసులో నిందితుడైన స్వీడిష్ జాతీయుడు క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ ను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు చికెన్ డిష్ తీసుకొని, డబ్బు చెల్లించడానికి ఎయిర్ హోస్టెస్ పిఓఎస్ మెషీన్‌తో అతన్ని సంప్రదించినప్పుడు, కార్డ్ స్వైప్ చేయాలనే సాకుతో జోనాస్ వెస్ట్‌బెర్గ్‌ అనుచితంగా ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకున్నాడు.తనను వేధించాడని ఎయిర్ హోస్టెస్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఇతర ప్రయాణికులను కూడా దుర్భాషలాడాడని ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది.నిందితుడిని ముంబయివిమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేసింది.