ధాన్యం రవాణాకు సరిపోయే లారీలను ఏర్పాటు చేయాలి - ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి

ధాన్యం రవాణాకు సరిపోయే లారీలను ఏర్పాటు చేయాలి - ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏలాంటి ఆటంకాలు లేకుండా, వేగవంతంగా నిర్వహించాలని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గంభీర్పూర్, రామక్కపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాత లారీల కొరతతో కేంద్రాల్లోనే ధాన్యము బస్తాలు రోజుల తరబడి నిలవ ఉంటున్నాయని ఆమె దృష్టికి రైతులు తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి ధాన్యం రవాణాకు లారీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పుష్పలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలన్నారు.తూకం వేసిన ధాన్యం బస్తాల రవాణాకు వాహనాల అధికారుల,రైస్ మిల్లు యజమానుల సమన్వయంతో చేయాలని సూచించారు.