క్వార్టర్లు కార్మికులక.. కార్మికేతరులక..? సింగరేణి క్వార్టర్లు కిరాయి దందా..!

క్వార్టర్లు కార్మికులక.. కార్మికేతరులక..?  సింగరేణి క్వార్టర్లు కిరాయి దందా..!

రామకృష్ణాపూర్,ముద్ర: సింగరేణి సంస్థ ఏర్పాటైన క్రమంలో సింగరేణిలో పనిచేస్తున్న అధికారుల,కార్మికుల సౌకర్యార్థం కోట్ల రూపాయలతో సంస్థ క్వార్టర్లను నిర్మించింది.అప్పట్లో నిర్మించిన సింగరేణి క్వార్టర్ల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. బొగ్గు గనులలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు దక్కాల్సిన క్వార్టర్లు కార్మికేతరులకు దక్కుతున్నాయి. అందిన కాడికి దోచుకుంటూ తాళాలు వేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సింగరేణి క్వార్టర్ల కిరాయి దందాపై "ముద్ర" రామకృష్ణాపూర్ రిపోర్టర్ అందిస్తున్న ప్రత్యేక కథనం..


లీడర్లు సొమ్ము చేసుకుంటున్నారు..

పట్టణంలోని పలుకుబడి కలిగిన కొందరు లీడర్లు సెక్యూరిటీ సిబ్బందిని దగ్గర పెట్టుకొని క్వార్టర్లను తమ ఆధీనంలోని తీసుకుంటున్నారు. లీడర్లకు సంబంధించిన దగ్గరి వ్యక్తులకు కిరాయి రూపంలో క్వార్టర్లను అప్పగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక డిస్మెంటల్ కింద ఉన్న కొన్ని ప్రాంతాలలోని క్వార్టర్లను పూర్తిగా తొలగించి యదేచ్చగా నిర్మాణాలు చేస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతోనే నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు.

కార్మికులకు క్వార్టర్లు దక్కడం లేదు..

మీడియా ముసుగులో ఉన్న కొందరు అధికారులతో దగ్గరి సంబంధాలు పెట్టుకొని తమకు ఉండేందుకు క్వార్టర్ కావాలంటూ చెప్పి నచ్చిన వారికి ఇస్తు డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్మికులకు దక్కాల్సిన క్వార్టర్లను దక్కకుండా చేస్తున్నారు. ఇటీవల రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ఓ రిపోర్టర్ క్వార్టర్ కు తాళం వేసి  తన అధీనంలో పెట్టుకున్నాడు. అదే క్వార్టర్ సింగరేణి కార్మికునికి కేటాయించడంతో ఇద్దరి మధ్య పొట పోటీ నెలకొంది..తనకే క్వార్టర్  కావాలంటూ రిపోర్టర్ చెప్పడంతో కార్మికుడు ఉన్నత అధికారులను ఆశ్రయించాడు. అందులోనే ఉండాలని అధికారులు చెప్పడంతో తిరిగి వెళ్ళాడు. ఇద్దరి మధ్య జరిగిన ఈ క్వార్టర్ వ్యవహారం చిలికి చిలికి పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కాంప్రమైజ్  
కావడంతో చివరికి కార్మికునికే  క్వార్టర్ దక్కింది. 


అధికారులు దృష్టి పెట్టడం లేదు..

సింగరేణి సంస్థ లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన క్వార్టర్లపై  అధికారులు దృష్టి పెట్టక పోవడంతోనే పలుకుబడి కలిగిన కొందరు కిరాయిలకు ఇస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు దక్కాల్సిన క్వార్టర్లపై ఉన్నత అధికారులతో విచారణ జరిపించి కిరాయి దందాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికులు కోరుతున్నారు.