ఆడబిడ్డ వివాహానికి  సింగిల్విండో అధ్యక్షుని ఆర్థిక సహాయం

ఆడబిడ్డ వివాహానికి  సింగిల్విండో అధ్యక్షుని ఆర్థిక సహాయం

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ముష్కం రేణుక అంజయ్య కూతురు ప్రియాంక వివాహానికి బుధవారం 5 వేల 116 రూపాయల  ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లహరి దంపతులు కలిసి అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కృష్ణారెడ్డి దంపతులకు ముష్కం అంజయ్య కుటుంబంతో పాటు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గంట దేవా గౌడ్, బంధారపు బాల్ రెడ్డి, సుంకి భాస్కర్  తదితరులు పాల్గొన్నారు