లోదుస్తుల్లో  పేస్ట్ గా, పౌడర్ రూపంలో బంగారం స్మగ్లింగ్

లోదుస్తుల్లో  పేస్ట్ గా, పౌడర్ రూపంలో బంగారం స్మగ్లింగ్
  • శంషాబాద్ విమానాశ్రయం లో ఇద్దరి పట్టివేత

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి :-శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. వేరు వేరు ఫ్లైట్ లో వచ్చిన ఇద్దరు  ప్రయాణికులు వధ బంగారం పట్టుకున్నారు.దుబాయ్ ( 6ఈ 1484) విమానంలో హైదరాబాద్ వచ్చిన వ్యక్తి వద్ద ప్లాస్టిక్ బాక్స్ లో బ్రౌన్ కలర్ రూపంలో బంగారాన్ని చిన్నపిల్లలు పాలు తాగే పౌడర్ లాగా అమర్చి తీసుకెళుతున్న సమయంలో పట్టుకోగా 127 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు విలువ 7, 77621 లక్షల రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు.మరో దుబాయ్ ఎమిరేట్స్ ఈకె 524 విమానంలో ఆదివారం తెల్లవారు జామున వచ్చిన మహిళా ప్యాసింజర్ వద్ద 726 గ్రాముల బంగారం విలువ 45 లక్షల 37, 500 బంగారంన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు సదరు మహిళ ప్రయాణికురాలు తన లోదుస్తుల్లో (ఇన్నర్ లో) ప్యాకెట్ అమర్చి గోల్డ్ బంగారాన్ని పేస్టులా మార్చి, బంగారంతో పాటు రెండు గోల్డ్ చైన్స్ తరలించే క్రమంలో కస్టమ్స్ తనిఖీల్లో బంగారంని అధికారులు పట్టుకున్నారు.వీరి పై కేసులు నామోదు చేసి దర్యాప్తు జరుపునట్లు అధికారులు తెలిపరు