గొడిసిర్యాల శివాలయంలో అద్భుతం..

గొడిసిర్యాల శివాలయంలో అద్భుతం..

ప్రతి ఏటా గుడిలోకి నాగుపాము

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసిర్యాల శివాలయంలో శుక్రవారం శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో నాగుపాము వచ్చింది.ప్రతి ఏటా ఈ అద్భుతం జరుగుతుంది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయంలో భక్తుల మధ్యనుంచి నాగుపాము గుడిలోకి వస్తోంది.

దేవాలయంలో శివలింగం చుట్టూ తిరిగి గుడంతా కలియదిరిగాక వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ పామును భక్తులు కూడా ఏమీ అనరు. అలాగే పాము కూడా ఈ ఎవరికి ఎలాంటి హానీ చేయకుండా వెళుతుంది. ప్రతి ఏడాది ఈ అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు భక్తులు ఈ దేవాలయాన్ని ప్రత్యేకంగా సందర్శిస్తారు.