Take a fresh look at your lifestyle.

చర్లపల్లి టెర్మినల్ కు మారనున్న కొన్ని ప్రధాన రైళ్ళు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కొత్తగా చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన నేపథ్యంలో క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్లను ఈ టెర్మినల్ కు మార్చబోతున్నారు. ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. చెన్నై సెంట్రల్‌- హైదరాబాద్‌- చెన్నై సెంట్రల్‌ (12603/12604) సూపర్ ఫాస్ట్ ను మార్చి 7వ తేదీ నుంచి చర్లపల్లికి మార్చారు. ఇకనుంచి ఆ రైలు చర్లపల్లి నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై నుంచి వచ్చేటప్పుడు చర్లపల్లి వరకే వస్తుంది. అలాగే మార్చి 12వ తేదీ నుంచి గోరఖ్‌పుర్‌- సికింద్రాబాద్‌- గోరఖ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12589/12590) కూడా సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లికి మార్చారు. అలాగే సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి టెర్మినల్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

జనవరి 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. 8.32కి చర్లపల్లికి చేరుకుంటుంది. ఒక నిముషం హాల్టింగ్ తర్వాత బయలుదేరుతుంది. అలాగే సిర్పూర్‌కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకొని ఒక నిముషం తర్వాత సికింద్రాబాద్ కు బయలుదేరుతుంది. గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17201) ఇంటర్ సిటీ మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ (17202) మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగి ఒక నిముషం తర్వాత బయలుదేరతాయి. సికింద్రాబాద్‌-సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (17233) మధ్యాహ్నం 3.47కి, సిర్పూర్‌కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (17234) ఉదయం 9.20కి చర్లపల్లిలో ఒక నిముషం ఆగి బయలుదేరతాయి. భవిష్యత్తులో షాలిమార్, హౌరా, సంత్రాగచ్చి, న్యూఢిల్లీ తదితర దూర ప్రాంతాలకు నడిచే రైళ్లను కూడా చర్లపల్లి నుంచి ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

చర్లపల్లి నుంచి సంక్రాంతికి కొన్ని ప్రత్యేక రైళ్ళు

ఈనెల 6, 8, 11, 15 తేదీల్లో చర్లపల్లి-తిరుపతి, 7, 9, 12, 16 తేదీల్లో తిరుపతి-చర్లపల్లి, 13న వికారాబాద్- కాకినాడ, 14న కాకినాడ-చర్లపల్లి, 9, 16 తేదీల్లో కాచిగూడ-తిరుపతి, 10, 17 తేదీల్లో తిరుపతి- కాచిగూడ, 11, 18 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్, 12, 19 తేదీల్లో నర్సాపూర్-చర్లపల్లి, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్-కాకినాడ, 12, 19 తేదీల్లో కాకినాడ-సికింద్రాబాద్, 7, 9, 13, 15, 17 తేదీల్లో చర్లపల్లి- నర్సాపూర్, 8, 10, 14, 16, 18 తేదీల్లో నర్సాపూర్-చర్లపల్లి, 8, 10, 12, 14 తేదీల్లో చర్లపల్లి-కాకినాడ, 9, 11, 13, 15 తేదీల్లో కాకినాడ-చర్లపల్లి, 6, 13 తేదీల్లో నాందేడ్-కాకినాడ, 7, 14 తేదీల్లో కాకినాడ- నాందేడ్, 9, 12, 14 తేదీల్లో చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస), 10, 13, 15 తేదీల్లో శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి, 7న కాచిగూడ- శ్రీకాకుళం రోడ్, 8న శ్రీకాకుళం రోడ్-కాచిగూడ రైళ్ళు నడవనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.