అయోధ్య రామ అక్షింతల కు పూజలు

అయోధ్య రామ అక్షింతల కు పూజలు

ముద్ర /వీపనగండ్ల:-అయోధ్యలో జనవరి 24న నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభమవుతుండడంతో రాములవారికి పూజలు చేసిన అక్షింతలను మండల పరిధిలోని గోవర్ధనగిరి శ్రీరాముల వారి ఆలయంలో వారం రోజులపాటు ప్రత్యేక ప్రజలు నిర్వహిస్తున్నట్లు బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కల రామన్ గౌడ్ తెలిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామం లోని ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేయడం జరుగుతుందని రామన్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.