రాష్ట్రస్థాయి అండర్ 19 ఇయర్స్ బ్యాట్మింటన్ పోటీలు ఆరంభం - పోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ రాజేశ్వరి పాల్గొన్న కలెక్టర్ 

రాష్ట్రస్థాయి అండర్ 19 ఇయర్స్ బ్యాట్మింటన్ పోటీలు ఆరంభం - పోటీలను ప్రారంభించిన రామగుండం సీపీ రాజేశ్వరి పాల్గొన్న కలెక్టర్ 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ 19 ఇయర్స్ బాల, బాలికల పోటీలను రామగుండం సీపీ రేమ రాజేశ్వరి ప్రారంభించారు. బుధవారం రంగంపేటలోని బ్యాట్మింటన్ అకాడమీలో పోటీలు ప్రారంభం కాగా కలెక్టర్ సంతోష్, డీసీపీ సుధీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీపీ కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సహపరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, క్రీడలను, క్రీడాకారులను. ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ కోసం స్నేహపూర్వక వాతావరణంలో పోటీ పడాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలు ఉల్లాసభరిత వాతావరణం లో జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ సదయ్య ,బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ చంద్రమోహన్ గౌడ్, ప్రధాన సలహాదారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్, విద్యా శాఖ అధికారి యాదయ్య, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి శ్రీకాంత్ ఇతర అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.