రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లో మంచిర్యాల రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శుశ్రుత్ ( 17) ట్రాక్టర్ ఢీ కొని మృతి చెందాడు. ఆదిలాబాద్ లో కంటి వైద్యునిగా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధార్థ స్థానిక తన్వి టవర్స్ లో నివాసం ఉంటున్నారు. మృతుడు ఆయనకు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు పదో తరగతి చదువు తున్నాడు.  మృతుని తల్లి సోన్ మండలం బొప్పారం లో యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. మృతుడు స్థానిక దీక్ష కళాశాల లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ ఘటన అనంతరం మృతదేహాన్ని స్వస్థలం హైదరాబాద్ కు తరలించారు.