కబ్జానిగాలో గంపలపెల్లి చెరువు - ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత

కబ్జానిగాలో గంపలపెల్లి చెరువు - ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత

ముద్ర, లక్షెట్టిపేట:గంపలపల్లి చెరువును కాపాడలని గంగపుత్రుల సంగం ఆధ్వర్యంలో ఎమ్మార్వో జ్యోష్ణకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,సర్వే నెంబర్ 82, 83, 84లో  పూర్తిగా 94 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో 84 సర్వే నెంబర్లు సుమారు రెండు ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్న కబ్జాదారులు ఇకనైనా అధికారులు దీనిపై దృష్టి సారించి చేరువు హద్దులు ఏర్పాటు చేసి కాపాడాలని లక్షటిపేట. ఇటిక్యాల. గంపలపల్లి. గంగపుత్రులు కోరుకుంటున్నరు.