మంచిర్యాల లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

మంచిర్యాల లో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది  దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రలోని కలెక్టర్ కార్యాలయం లో  ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు భై పాస్ రోడ్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం  వద్ద తెలంగాణ ఉద్యమ వీరులకు సుమన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య , కలెక్టర్ సంతోష్ , డీసీపీ సుధీర్ , మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి వందనాలు సమర్పించారు. ఈసందర్భంగా బాల్క సుమన్ తొమ్మిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గురించి నివేదిక చదివారు.