పాన్​ ఇండియా లెవెల్లో తెలంగాణ బతుకమ్మ

పాన్​ ఇండియా లెవెల్లో తెలంగాణ బతుకమ్మ

తెలంగాణ పండుగ బతుకమ్మ  ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో వెళుతోంది. సల్మాన్ ఖాన్ ), వెంకటేష్ , పూజ హెగ్డే  నటిస్తున్న హిందీ సినిమా 'కిసి క భాయ్ కిసి కి జాన్'  సినిమా నుండి ఈ బతుకమ్మ పాటను విడుదల చేశారు. బతుకమ్మ పండుగను తెలంగాణాలో  ఎంతో సంబరంగా తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ఈ పండగ ని పువ్వుల పండగ అని కూడా అంటారు, ఎందుకంటే ఎక్కువగా పువ్వులతో డెకరేట్ చేస్తారు కాబట్టి.  ఈ సినిమా నుండి విడుదల అయిన ఈ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజహెగ్డే అందరూ తెలుగు తనం ఉట్టి పడే విధంగా అవుట్ ఫైట్స్ కట్టుకొని కనబడతారు. సల్మాన్ ఖాన్ తనకి ఈ బతుకమ్మ సంబరాలు అంటే ఎంత ఇష్టమో ఈ సినిమాలో ఈ పాట ద్వారా చెప్పాడు. ఈ పాట ఈ సినిమాలో హైలైట్ అవుతుందని కూడా ఈ సినిమా నిర్వాహకులు నమ్ముతున్నారు. తెలంగాణ సంప్రదాయం, సంస్కృతికి అద్దం పట్టే  విధంగా ఈ పాట వుండబోతోందని  కూడా తెలుస్తోంది. 200 మంది డాన్సర్స్ తో ఈ పాటను కోరియోగ్రఫీ చేశారు. ఇందులో ఆధునిక సంగీతాన్ని కూడా మిక్స్ చేసి, తెలంగాణ బతుకమ్మకు సంబదించిన పాటగా తయారుచేశారు. తెలంగాణ బతుకమ్మ పండగకి, అలాగే తెలంగాణా ప్రజలకి ఈ పాట ఒక ట్రిబ్యూట్  లాంటిదని కూడా చెపుతున్నారు. ఈ బతుకమ్మ పాటకి సంగీతం రవి బస్రూర్ సమకూర్చగా, సంతోష్ వెంకీ, ఉడుపి, హరిణి ఇవటూరి, సుచేత బస్రూర్, విజయలక్ష్మి ఈ పాటకి గొంతునిచ్చారు. ఇందులో కొన్ని తెలుగు పదాలు కూడా వుంటాయని తెలిసింది.