ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పదో వార్షిక ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయ సముదాయాన్ని అందంగా అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు ఫైజాన్అహ్మద్, కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఎ ఎస్ పి కాంతిలాల్ పాటిల్, ఆర్డీవో రత్న కల్యాణి, డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అమర వీరుల స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. తెలంగాణా సాధనలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు.