దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలి

దశాబ్ది ఉత్సవాలు పండుగలా జరపాలి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సావాలు పండుగలా జరపాలని దశాబ్ది ఉత్సవాల  నోడల్ అధికారి , రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్ సూచించారు. బుధవారం మంచిర్యాల జిల్లా సిసిసీ నస్పూర్ లోనీ సింగరేణి గెస్ట్ హౌస్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. దశాబ్ది ఉత్సవాలలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా కార్యక్రమాలు జరపాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంతోష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.