పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

కోదాడ, ముద్ర:పురాతన ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని టిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు అన్నారు.బుధవారం మునగాల మండలం  వెంకట్రాంపురం గ్రామంలో  సీతా రామచంద్ర  స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి మరియు  శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో వారు  ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. స్వామి వారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు ఆలయాల నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలోముత్తారం పాండురంగారావు  కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ , మున్సిపల్ కౌన్సిలర్లు కొండపనేని పద్మ నాగేశ్వరరావు  పెండెం  వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పిటిసి గరినే కోటేశ్వరరావు.బీఆర్. ఎస్ పార్టీ మునగాల అధ్యక్షుడు  తొగర్ రమేష్ , శశిధర్ రెడ్డి యువసేన నాయకులు. రావి రవి , గుండు సతీష్ దొంతగాని లింగయ్య  పత్తిపాక లక్ష్మీనారాయణ , సుంకర శీను అంబటి శ్రీనివాస్ రెడ్డి  దొంగరి సత్యనారాయణ , జిల్లపల్లి వంశీ. వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.