సెక్రటేరియట్ ప్రారంభం వాయిదా | Mudra News

సెక్రటేరియట్ ప్రారంభం వాయిదా | Mudra News
రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక, హైద్రాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17 న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే  ప్రకటించిన రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్థుతానికి  వాయిదా వేస్తున్నట్లు సిఎంవో కార్యాలయం తెలిపింది. తదుపరి తేదీని తిరిగి ప్రకటించడం జరుగుతుందన్నారు.