Take a fresh look at your lifestyle.

తెలంగాణ ప్రపంచానికి రోల్ మోడల్‌గా ఉండాలి

  • మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడ్డ తెలంగాణ.
  • నెంబర్ వన్ గా నిలవడం గర్వించదగ్గ విషయం.
  • హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌ కు ఆయన బృందానికి సీఎం అభినందనలు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : వివిధ రంగాల్లో తెలంగాణ ప్రపంచానికి రోల్ మోడల్‌గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి తెలంగాణ నేడు పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌ కు ఆయన బృందానికి అభినందనలు తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం తాను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు మద్దతుగా ఉంటానని వ్యాఖ్యానించారు.ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. దుబాయ్‌లో ఇటీవల నిర్వహించిన వరల్డ్‌ పోలీస్‌ సమ్మిట్‌-2025లో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిషనర్‌ సీవీ ఆనంద్‌.. సమ్మిట్‌లో ఎక్సలెన్స్‌ ఇన్‌ యాంటీనార్కోటిక్స్‌ విభాగంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుని అవార్డు స్వీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదిగా స్పందించారు.

Leave A Reply

Your email address will not be published.