తుంగతుర్తి కాంగ్రెస్ నుండి ముగ్గురు పేర్లు ఖరారు..!

తుంగతుర్తి కాంగ్రెస్ నుండి ముగ్గురు పేర్లు ఖరారు..!

తుంగతుర్తి, ముద్ర ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అన్ని నియోజకవర్గాలతో పాటు తుంగతుర్తి నియోజకవర్గం నుండి 15 మంది ఆశావహులు తమ దరఖాస్తులను గాంధీభవన్ అధిష్టానానికి సమర్పించారు ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులలో మూడు పేర్లను ఏఐసీసీ కి పంపనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న 15 మందిలో ఏ ముగ్గురి పేర్లు పంపుతారో పంపిన ముగ్గురిలో ఏ ఒక్కరి పేరు సూచిస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది దాదాపుగా అందరూ ఆశావహులు హైదరాబాద్లో మకాం వేసి గాంధీభవన్లో రాష్ట్ర పెద్దలు ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది తుంగతుర్తి నియోజకవర్గం గతంలో పోటీ చేసి ఓడినవారు ఇద్దరు అద్దంకి దయాకర్ రెండుసార్లు దయాకర్ కన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో గుడిపాటి నరసయ్య పోటీ చేసి ఓడిపోయారు.

అలాగే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా బర్త్డే రవి పోటీ చేసి ఓటమి పాలయ్యారు మిగతావారు ఏనాడు అసెంబ్లీకి పోటీ చేయని భార్య కావడం గమనాభం అనాదిగా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయ చక్రం మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కనుసన్నల్లో తిరుగుతుండగా దామోదర్ రెడ్డి సూచనలు ఏమైనా అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా లేక ఆదేష్టానం గతంలో మాదిరిగా దామోదర్ రెడ్డి సూచనలు కాదని అభ్యర్థి ఎంపిక చేస్తారా గత అనుభవాలు నేర్పిన పాటల ప్రకారం చూస్తే ఈసారి దామోదర్ రెడ్డి సూచన కొంతవరకైనా పరిగణలోకి తీసుకొని గెలిచే స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నం అధిష్టానం చేస్తుందనే మాట వినవస్తోంది అదే జరిగితే దామోదర్ రెడ్డి సూచించే వ్యక్తి ఎవరై ఉంటారనేది ప్రశ్నగా మిగిలింది ముఖ్యంగా ఈసారి ఎన్నికలు ఆర్థిక భారంతో కూడుకున్న నేపథ్యంలో అలాంటి ఆర్థిక బలం కూడా అభ్యర్థి విషయంలో పరిగణలోకి తీసుకుంటే అభ్యర్థి ఎవరు అవుతారు అనేది కూడా సందేహస్పదమే ఎవరికి వారు మాత్రం ఈసారి తనకు తప్పకుండా ఇస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇటీవల నియామకమైన అన్యపర్తి జ్ఞాన సుందర్ తనకు ఎన్నోసార్లు అవకాశం రావడం తీరా టికెట్ వచ్చే సమయానికి ఏదో ఒక అమాంతరం వచ్చి టికెట్ రాకుండా పోయిందని ఈసారి దాదాపు తనకు అవకాశం ఇస్తారని అంటున్నారు గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వడ్డేపల్లి రవి ఈసారి తనకు టికెట్ వస్తుందని నియోజకవర్గంలో తాను అన్ని గ్రామాల్లో సుపరిచితు డే నని అంటున్నారు.

ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ పిడమర్తి రవి తాను తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగి ఉన్నానని తుంగతుర్తి టికెట్ తనకు ఇస్తే బీఆర్ఎస్ ని ఓడిస్తానని అంటున్నారు అలాగే తుంగతుర్తి నియోజకవర్గం లో మాజీ మంత్రి అనుచరుడిగా పేరున్న గుడిపాటి నరసయ్య తాను గతంలో జడ్పిటిసిగా పనిచేశానని అలాగే ఉమ్మడి రాష్ట్రంలో తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు బీఫామ్ వచ్చిందని కానీ కొంతమంది తనను పక్కకు తోసి బి ఫామ్ తెచ్చుకున్నారని దీంతో తన అవకాశం పోయిందని ఈసారి తప్పకుండా తనకు పోటీ చేసే అవకాశం ఇస్తారని ఆశాభావం నరసయ్య వ్యక్తం చేస్తున్నారు అలాగే మిగతా ఆశావహులు కందుకూరి అంబేద్కర్ ,ఇటికాల చిరంజీవి,నగరి గారి ప్రీతం ,భాష పొంగు భాస్కర్ ,యుగంధర్, కృష్ణవేణి ,అంజన రేణుక, మమతా నాగిరెడ్డి ,కె రమేష్, కరుణాసాగర్ తలా ఒక అర్హత తమకు ఉందని తమకు పోటీ అవకాశం ఇవ్వాలని కోరుతుండగా రెండుసార్లు స్వల్ప మెజారిటీతో ఓటమిపాలైన అద్దంకి దయాకర్ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం తనకు ఈసారి అవకాశం ఇస్తుందని అంటున్నారు తాను పోటీ చేసిన రెండుసార్లు ఓటమికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు ముఖ్యంగా రెండవసారి రెబల్ అభ్యర్థి వల్లనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని దయాకర్ మాట నియోజకవర్గంలో దాదాపు సగం ఓట్లకు పైగా వచ్చాయని అధిష్టానం తనకు తప్పకుండా ఈసారి అవకాశం ఇవ్వవచ్చని భీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ఆశావాహులందరూ ఎవరికివారు తామే అభ్యర్థుల మహోదామని ధీమాతో ఉండగా అధిష్టానం ఏ వ్యక్తిని అభ్యర్థిగా చేస్తారో వచ్చే అభ్యర్థి ఎలాంటి పై రవి లేకుండా వస్తారా లేక గత రాజకీయ చరిత్ర పునరావృతం అవుతుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది