టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ద‌గ్దం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ద‌గ్దం

ముద్ర‌, జమ్మికుంట: రాష్ట్రంలోని రైతాంగంపై టీపీసీసీ అద్య‌క్షుడు రేవంత్ రెడ్డి చేసిన త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస‌స్తూ బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు ప‌ట్ట‌ణంలోని బస్టాండ్ స‌మీపంలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ‌ను బీఆర్ ఎస్ నాయ‌కులు ద‌గ్దం చేశారు. ఈ సంద‌ర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ర్టంలోని రైతాంగానికి 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్త‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని, రైతు బందు కింద ఎక‌రాకు రూ. 10 వేలు ఇస్తున్నామ‌న్నారు.  కెసిఆర్ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని,సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ది చెందుతుంద‌ని, కాంగ్రెస్ నాయ‌కులు ఎన్ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్నకోటి కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు,త‌దిత‌రులు పాల్గొన్నారు.