ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం.. ఆర్టీసీ ప్రగతికి చిహ్నం - కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ఆర్టీసి బస్సులో ప్రయాణం సురక్షితం..  ఆర్టీసీ ప్రగతికి చిహ్నం -  కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్ (జూలై14): ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.కొల్లాపూర్ నుండి కదిరేపాడు, శాగాపూర్ పానుగల్ మీదుగా వనపర్తికి ఆర్టీసీ బస్సును శుక్రవారం ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రగతికి చిహ్నం అని సంస్థ ను కాపాడుకోవలసిన బాధ్యత ప్రయాణికులపై ఉందన్నారు.గతంలో ఆర్టీసీ బస్సును నడిపేవారని,ప్రయాణికులు బస్సులో ప్రయాణించక పోవడంతో ఆర్టీసీ అధికారులు బస్సుల రవాణా నిలిపివేశారని,గ్రామ పర్యటనలో బాగంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అధికారులు బస్సును పునరుద్ధరించడం సంతోషం అన్నారు.ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయపాలనతో బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

బస్సు టికెట్ తీసుకొని సింగోటం గ్రామం వరకు బస్సులో ప్రయాణించారు .తమ గ్రామానికి కరోనా తర్వాత బస్సు సౌకర్యాన్ని కల్పించినందుకు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కి,మండల స్థాయి ప్రజాప్రతినిధులకు,మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సుబ్బయ్య యాదవ్,మండల కో ఆప్షన్ సభ్యులు అలిమ్ పాషా,BRS పార్టీ నాయకులు తిరుపతి యాదవ్,చంద్రయ్య,రాజేందర్,రవి,భీముడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు..