సింగరాచార్యులు భౌతిక కాయనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మల్లు లక్ష్మి

సింగరాచార్యులు భౌతిక కాయనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న మల్లు లక్ష్మి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఒక మారు మూల గ్రామంలో పుట్టిన సింగరాచ్చర్యులు తెలుగు, సాంస్కృత భాష అభివృద్ధి కొరకు ఎన్నో సేవలు అందించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ అన్నారు. సోమవారం  హైదరాబాద్ లోఆంధ్ర జ్యోతి ప్రధాన సంపాదకుడు కె శ్రీనివాస్ తండ్రి అలహా సింగరాచ్చర్యులు(93 ) మృతి చెందారు..

ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ వారీ కుటుంభం సిపిఎం రాజకీయ నేపథ్యం ఉన్నవారని వారి అన్న లక్ష్మీనరసింహ చార్యులు సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నర్సింహ రెడ్డి దళం లో పని చేశారన్నారు.
ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పని చేసి పదన్నోతులు పొందిన ఆయన ఆలోచనలు, భావాలు ప్రజలకు దగ్గరగా ఉండేవని అన్నారు. సింగరాచ్చర్యులు ఆకాశవాణి లో పని చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు భవితరానికి పుస్తక రూపం లో వచ్చాయని ఆమే అన్నారు. వారి మార్గం లొనే చిన్న కుమారుడు శ్రీనివాస్ పత్రిక రంగంలో పని చేస్తూ సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగంలో ప్రజలకు ఉపయోగ పడే రచనలు రాస్తూ పాలకులు అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు కష్టం కలిగించే ప్రతి విషయాన్ని ముక్కు సూటిగా,విమర్శ ఆయుధాలు ఎక్కు పెట్టుతారని ఆమే కొనియాడారు. వారి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని, వారు చూపిన నీతి వంతమైన మార్గం లో పయనించాలని అప్పుడే వారికి నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళం అవుతామని, సింగరాచ్చర్యులు కు సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, యర్రం శెట్టి పుల్లయ్య విశ్రాంత తహశీల్దార్ పాల్గొన్నారు.