తుంగతుర్తి మండలం ఘనంగా బోనాల పండుగ

తుంగతుర్తి మండలం ఘనంగా బోనాల పండుగ

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండలం లో బోనాల పండుగను వివిధ గ్రామాలలో ఘనంగా జరుపుకున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకొని ఆయా గ్రామాలలోని అమ్మవారి దేవాలయాల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించి ఘనంగా పూజలు నిర్వహించారు.ఏ  గ్రామంలో చూసిన బోనాల పండుగ సందడి కనిపించింది .శ్రావణమాస బోనాల సందడి గ్రామాల్లో కొత్తదనాన్ని తెచ్చింది.