ఘనంగా ఉగాది వేడుకలు 

ఘనంగా ఉగాది వేడుకలు 

భక్తులతో కిటకిటలాన ఆలయాలు 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాదిని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే దర్శనం కోసం బారులు తీరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో క్రోది నామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడి తయారు చేసి, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా, జిల్లా డీసీసీ అధ్యక్షుడు, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ లు ఉగాది పూజ చేశారు. శ్రీమాన్ నంబివేణుగోపాల చార్య కౌశిక,  తిగుళ్ళ విషు శర్మ పంచాంగ శ్రవణం చేశారు.

పట్టణంలోని మార్కండేయ టెంపుల్, అయ్యప్ప ఆలయం, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, విశ్వేశ్వర ఆలయం, ధరూర్ క్యాంపు కోదండ రామాలయం, శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, శిరిడి సాయిబాబా ఆలయంలలో పంచాంగ శ్రవణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఉగాది పచ్చడి, బూరెలు పంపిణీ చేశారు. అలాగే మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ఉగాది పచ్చడి పంపిణీ ప్రారంభించారు. పచ్చడితో పాటు బూరెలు పంపిణి చేశారు. నూతనంగా ఎన్నికైన జగిత్యాల బార్ మరియు క్లబ్ అసోసియేషన్ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలోబండారి రాజ్ కుమార్, దీటి అంజయ్య పటేల్, జంగిలి రవికుమార్బాదినేని రాజేందర్ ,రంగు గోపాల్ వోడ్నాల రాజశేఖర్ ,మంగళారపు మహేష్,తోట మల్లి కార్జున్,కొలగాని సత్తన్న,తదితరులు పాల్గొన్నారు.