గని సామాగ్రికి భద్రత కరువైందా..?

గని సామాగ్రికి భద్రత కరువైందా..?

రామకృష్ణాపూర్, ముద్ర : మందమర్రి ఏరియా ఆర్కే వన్ ఏ గనిలోని సామాగ్రికి భద్రత కరువైందా..? అంటే అవుననే సంకేతాలు కార్మిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల దగ్గర పలుకుబడి కలిగిన కొంత మంది యూనియన్ సంఘాల లీడర్లు అందిన కాడికి సామాగ్రిని దోచుకోచుకుంటున్నారు. ఇందంత పై స్థాయి అధికారులకు తెలిసే జరుగుతుందా..? తెలియకుండానే చేస్తున్నారా అనే విమర్శలు లేకపోలేదు. 

సామగ్రి తెచ్చి..ఇంట్లో పెట్టీ

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఓ యూనియన్ సంఘానికి చెందిన లీడర్ గనికి సంబంధించిన సామాగ్రిని ఏకంగా లారీలో తీసుకొచ్చుకొని తన ఇంట్లో కాకుండా సమీప బంధువుల ఇండ్లల్లో శనివారం ఉదయం నలుగురు కార్మికుల సహాయంతో అన్లోడ్ చేయించుకున్నారనేది విశ్వనీయ సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో రెల్స్ ను ఎలా తెచ్చుకున్నారు..ఎందుకు తెచ్చుకున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికైనా సింగరేణి పై స్థాయి అధికారులు మూసి వేయబడుతున్న గనులలోని
పాత సామాగ్రిని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పలువురు  అభిప్రాయపడుతున్నారు.