గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ముద్ర ప్రతినిధి భువనగిరి: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మండలంలోని ఎర్రంబెల్లీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఎర్రంబెల్లీ గ్రామ శివారు నార గుట్ట పై గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడని గ్రామ పంచాయతి కారోబార్ సత్తయ్య ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలం కు  మృతదేహాన్ని పరిశీలించినట్లు చెప్పారు. సుమారు 35 నుండి 40 సంవత్సరాల వయస్సు మధ్య గల ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి రెండు మూడు రోజుల క్రితం అక్కడికే వెళ్ళి చనిపోయి ఉండవచ్చునని, అతని జుట్టు, గడ్డం బాగా పెరిగి వుండి, శరీరం పై చొక్కా లేకుండా గోధుమ కలర్ ప్యాంట్, తెల్లని నైలాన్ కట్ బనియన్, రూప బ్రాండ్ స్టిక్కర్ గల బ్లూ కలర్ కట్ డ్రాయర్ వున్నాయని తెలిపారు.

చనిపోయిన వ్యక్తి తీరు చూస్తే బిచ్చగాడిగా కనిపిస్తున్నాడని  రెండు మూడు రోజుల క్రితం మతి స్థిమితం లేక నార గుట్ట మీదికి వెళ్ళి అక్కడ చనిపోయి ఉండవచ్చునన్నారు. మృత దేహం గుర్తు పట్టలేనంతగా ఉబ్బి పురుగులు పడి దుర్వాసన వస్తుందన్నారు. శవ పంచనామా నిర్వహించి మృత దేహం ను పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి మార్చురి రూమ్ లో బద్రపర్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.