కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను గుర్తించని : ప్రభుత్వం

కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను గుర్తించని : ప్రభుత్వం

రామకృష్ణాపూర్,ముద్ర : సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి నివేదన సభలో  మాట్లాడకుండా మరోసారి కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేశారని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రామకృష్ణాపూర్ ఏరియా కమిటీ నాయకులు లచ్చన్న,రవి ఆరోపించారు.శనివారం ఆర్కేపి సి.హెచ్.పి కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో సింగరేణిలో సైతం ఉత్సవాలను జరుపుకున్న తరుణంలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను వాడుకున్నారే తప్ప గుర్తింపు లభించలేదన్నారు. సింగరేణి వ్యాప్తంగా 18 రోజులపాటు సమ్మె చేసిన కార్మికులకు ఎలాంటి గుర్తింపు లభించకపోవడం బాధాకరమన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంట్రాక్టు కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,వెంకటేష్,మల్లయ్య,వనిత,ప్రేమలత,రూప తదితరులు పాల్గొన్నారు..