వెల్గటూర్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం...  

వెల్గటూర్ లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం...  

వెల్గటూర్, ముద్ర : వెల్గటూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007 -08 విద్యా సంవత్సరంలో "పదవ తరగతి"  చదువుకున్న  విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారు చదువుకున్న సమయంలో పొందిన అనుభవాలను  గుర్తుకు చేసుకున్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఒకరికొకరం సహాయం గా, తోడుగా ఉందామని తీర్మానించుకున్నారు. రోజంతా ఒకరికొకరు ఆనందంగా ఆడుతూ, పాడుతూ గడిపారు.  ఈ కార్యక్రమంలో పీఈటీ రాజయ్య,  ఉపాధ్యాయులు శంకర్ శర్మకు, శ్రీనివాస్, నల్లగొండయ్య , రామ్ చందర్,  చంద్రమౌళి, గణేష్, జోగం శ్రీనివాస్, నాగుల రమేష్, షఫీ, అండలు తదితరులు పాల్గొన్నారు.