గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్..

గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్..

...వివరాలు వెల్లడించిన డీఎస్పీ. ఉమా మహేశ్వర రావు 

మెట్‌పల్లి ముద్ర :- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ చెక్ పోస్ట్ వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఓబులాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు చెక్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించగా 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.దీని విలువ రూ 5 వేలు ఉంటుందని తెలిపారు.

మండలంలో విక్రయించడానికి గంజాయి తరలిస్తున్నరాని తెలిపారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీన పరుచుకుని వారిపై ఎండిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇద్దరు వ్యక్తులను రిమాండ్ కు తరలించారు. అనంతరం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించాడు. వీరితో పాటు సీఐ నవీన్, ఎస్సె కిరణ్ కుమార్, కానిస్టేబుల్ లు కిరణ్ కుమార్, రాజేష్, మారుతి ఉన్నారు.