బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజశేఖర్ రాజు విజయం

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజశేఖర్ రాజు విజయం
  •  ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, విజయ భాస్కర్ గౌడ్
  •  ఉత్కంఠ బరితంగా కొనసాగిన  బార్ అసోసియేషన్ ఎన్నికలు 

షాద్ నగర్, ముద్ర :  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బార్ అసోసియేషన్  ఎన్నికలు  ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. షాద్ నగర్ కోర్టు ఆవరణలో గురువారం నిర్వహించిన బార్ అసోసియేషన్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా  మర్రి శంకరయ్య వ్యవహరించారు. షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి బి.రాజశేఖర్ రాజు, ఎన్. వేణుగోపాల్, ఎంఏ రజాక్ హుస్సేన్లు పోటీ చేశారు. మొత్తం 141 ఓట్లు ఉండగా, 137 ఓట్లు పోలయ్యాయి. దీనిలో రాజశేఖర్ రాజు 86 ఓట్లు సాధించగా, ఎన్ వేణుగోపాల్ కు 48 ఓట్లు వచ్చాయి. ఎంఏ రజాక్ హుస్సేన్ కు  మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రాజశేఖర్ రాజు విజయం సాధించారు.

 బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా  టి.శ్రీనివాసులు 92 ఓట్లు, విజయ భాస్కర్ గౌడ్ 91 ఓట్లతో విజయం సాధించారు. వీరి పై పోటీ చేసిన చంద్రశేఖర్ కు 52 ఓట్లు, మదన్ మోహన్ కు  25 ఓట్లు వచ్చాయి. లైబ్రరీ సెక్రటరీగా  లక్ష్మయ్య 92 ఓట్లు సాధించి  విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి రమేష్ కు 62 ఓట్లు పోలయ్యాయి. గెలుపొందిన అభ్యర్థుల పదవి కాలం  సంవత్సరం  ఉంటుందని రిటర్నింగ్ అధికారి శంకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా తనకు ఓటు వేసి గెలిపించిన సహచర న్యాయవాదులకు అధ్యక్షులుగా ఎన్నికైన రాజశేఖర్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి, బార్ అసోసియేషన్ గౌరవాన్ని, ఉన్నతమైన వృత్తిని నిలబెట్టేందుకు తన పదవీ కాలంలో కృషి చేస్తానని రాజశేఖర్ రాజు  హామీ ఇచ్చారు.