ఓటు హక్కు వినియోగించుకున్న పార్టీల నేతలు

ఓటు హక్కు వినియోగించుకున్న పార్టీల నేతలు

కోరుట్ల, ముద్ర: కోరుట్ల నియోజకవర్గంలోని ప్రధాన పార్టీ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెటపల్లి లో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లాాధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల  నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ తన ఓటు హక్కును కోరుట్ల లో  వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికల జరగగా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.  వేసవి కాలం అధికంగా ఉండడం వలన ఓటర్లు తొందరగా పోలింగ్ బూత్ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగించుకున్నారని, కొత్తగా ఓటు వచ్చిన యువత ఉత్సాహంగా తమ యొక్క ఓటును భాద్యతగా వినియోగించుకున్నారని, దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి ప్రతి ఒక్కరూ తనవంతు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు.