యువత క్రీడల్లో రాణించాలి ... చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

యువత క్రీడల్లో రాణించాలి  ... చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
  • ఎస్సై కే రాణి
  •  బిజెపి రాష్ట్ర యువ నాయకులు దారాసింగ్

ముద్ర/వీపనగండ్ల :- యువత క్రీడల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని వీపనగండ్ల ఎస్సై కే రాణి అన్నారు. మండల కేంద్రమైన వీపనగండ్ల లో దీపావళి గంగమ్మ జాతర సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ రాష్ట్ర యువ నాయకుడు ధారాసింగ్ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షులు ముంత మల్లయ్య యాదవ్ టీచర్ జోల్లు గంగన్న సహకారంతో రత్నగిరి క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎస్సై కే రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు.

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. బిజెపి రాష్ట్ర యువ నాయకుడు ధారాసింగ్ మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయని, క్రీడారంగంలో రాణించాలంటే నిత్య సాధన అవసరమని అన్నారు. క్రీడా పోటీల వల్ల స్నేహభావం మరింత పెరుగుతుందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడాలని అన్నారు. క్రీడలను తాను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తానని క్రీడలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ధారాసింగ్ అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ముంతామల్ల యాదవ్, రైతు కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు మీసాల రాము మాదిగ, రవీందర్ రెడ్డి, గోపి నాయుడు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.